Saturday, November 12, 2011

దీక్ష తోరణం మాల ధారణం

వివిధ రకాల దీక్ష సంప్రదాయాల గురించి ఇందులో చూడవచ్చు. అయ్యప్ప మాల అందరికీ తెలిసిందే... అయితే భవానీ మాల, గోవింద మాల, సాయి దీక్ష వంటి వాటిని కూడా ఇందులో చేర్చాను. ఎవరికి వీలైన దీక్ష వారు చేపట్టి వాటిని ఆచరించవచ్చు. అందుకు అనుగుణంగా ఉండాలనే ఇన్ని వివరాలను ఇచ్చాను. ఆదరించడం మీ వంతు.

Wednesday, September 7, 2011


పెళ్ళికి ఎలా సిద్ధం కావాలి?

పెళ్ళంటే నూరేళ్ళ పంట కదా.... మరి పెళ్లి చేసుకుంటున్నామంటే దానికి ఎంత మంది సహకారమో కావాలి. పెళ్లి పెద్దగా వొకరో ఇద్దరో ఉంటె వారి మీద భారాన్నంతా నెట్టేసి ఊరుకుంటే సరిపోదు. మనం కూడా ఎన్నో చేయాలి. ఏది మర్చిపోయిన అభాసు పాలు కాక తప్పదు. అందుకే ఇందులో కొన్ని ముఖ్యమైన వాటిని గుర్తు చేసే ప్రయత్నం చేసాను. ఇది కూడా నేను నవ్య వీక్లీ లో ఉన్నప్పుడు రాసినదే.

హోలీ పండుగ గురించి తెలుసా?
హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాలను, ఆ పండుగ విశేషాలను వివరిస్తూ ఆ పండుగను ఎలా జరుపుకోవాలో చేతనైన రీతిలో చెప్పే ప్రయత్నం చేసాను. ఇది కూడా నవ్య వీక్లీ లో ఉన్నప్పుడు రాసినదే...




నవ్వుల గురించి నవ్య వీక్లీ లో నేను రాసిన వ్యాసం ఇది. వొకసారి చదివి మనసారా నవ్వుకోండి చాలు నా లక్ష్యం నెరవేరినట్లే...






పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నారు. పెళ్ల్లికి ముందు పుచ్చుకునేవే నిశ్చయ తాంబూలాలు. తాంబూలాలు పుచ్చుకున్నామంటే సగం పెళ్లి అయినట్లే. పెళ్ళికొడుకు పెళ్లికూతురూ ఫోన్ లలో సంభాషించుకోవడం చెట్టపట్టాలు వేసుకుని తిరగడం వంటి ఎన్నో విశేషాలను ఇక్కడ ఉంచాను.



శ్రావణ మాసమంటే మగువలకేంతో మక్కువ. అందరికీ అవసరమైన ధనధాన్యాలను ప్రసాదించే ఆ చల్లని తల్లి శ్రీమహాలక్ష్మిని సేవించుకునేందుకు అనువైన మాసం శ్రావణమే. ఈ మాసంలో మగువలు ఎప్పుడు ఏమి చేస్తే శుభప్రదమో చెప్పే ప్రయత్నం చేసాను.



ప్రతి వోక్కరూ తులసి చెట్టును పెంచాలని చెప్పింది శాస్త్రం. అయితే అసలు తులసి అంటే ఎవరు? తులసి మొక్కను పెంచితే కలిగే ఉపయోగాలేమిటి తదితర అంశాలను ఇందులో పొందుపరిచాను.



ఇందులో రుద్రాక్ష పుట్టుపూర్వోతరాలతోపాటు ప్రతి వోక్కరూ రుద్రాక్షలు ధరించడానికి ఉత్సుకత చూపుతుంటారు. అయితే అసలు రుద్రాక్షలను ఎవరు పడితే వారు ధరించావచ్చా లేదా, ధరిస్తే పాటించవలసిన నియమాలేమిటి? వాటిని ఎప్పుడు ధరించాలి వంటి విషయాలను గుదిగుచ్చి అందించే ప్రయత్నం చేసాను.


దీపావళి గురించి రాసిన ఐటెం ఇది. ఇందులో దీపావళి పండుగ పుట్టుపూర్వోత్తరాలు, దీపావళి పర్వదినం నాడు మనం ఏమి చేయాలి తదితర అంశాలు ఉన్నాయి.

Saturday, August 27, 2011

విశేష వినాయకుడు


వినాయకుడంటే నాయకుడు లేనివాడు అని అర్థం. అంటే ఆయనే అందరికీ అధినేత అని అర తరార్థం. అసలు వినాయకుడికి వివాహమైందా? ఆయనకు పత్రిపూజ అంటే ఎందుకంత మక్కువ? పూజ అనంతరం నిమజ్జనం ఎందుకు చేస్తారు? పూజ సంపూర్ణంగా, సావకాశంగా చేసుకోలేనివారు ఏం చేస్తే మంచిది? వంటి వివరాలు ఇందులో చూడవచ్చు.

జ్యేష్ఠ నుంచీ - రేవతి వరకు (నక్షత్ర వృక్షాలు -2)




ఇందులో జ్యేష్ట నుంచి రేవత వరకు ఆయా నక్షత్రాలలో జన్మించిన వారు పెంచవలసిన నక్షత్ర వృక్షాల వివరాలున్నాయి. వాటితోబాటే అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి, వృక్షాలు పెంచడం సాధ్యంకాని వారికి వారు ఏం చేయాలో పరిష్కార మార్గాలు ఇందులో చూడవచ్చు.

మీ నక్షత్రానికి తగ్గ వృక్షాన్ని పెంచండి... దానితోపాటే వృద్ధిచెందండి...


నక్షత్రాన్ని బట్టి నవరత్నాలు గల రాయిని ఉంగరంలో ధరించినట్లే, ఒక్కో నక్షత్రం పైనా ఒక్కో వృక్షం ప్రభావం ఉంటుంది. మనం మన నక్షత్రానికి చెందిన వృక్షాన్ని స్వయంగా నాటి, దాని పోషణ భారాన్ని వహించి, సంరక్షణ చేసినట్లయితే మనం కూడా దానితో బాటే అంచెలంచెలుగా వృద్ధిచెందుతాం. అలా 27 నక్షత్రాలలో అశ్వని నుంచి అనూరాధ వరకు గల నక్షత్రాలకు సంబంధించిన నక్షత్ర వృక్షాలను ఈ భాగంలో చూడవచ్చు.

దిష్టి తీసేయండిలా...


దిష్టి ప్రతి ఒక్కరినీ బాధించే సమస్య. చెడు దిష్టి తగిలితే పసిపిల్లలు పాలు తాగరు, పశువులు పాలివ్వవు. వాహనాలు మొరాయిస్తాయి. ఉద్యోగం హరిస్తుంది. సంపదలు నశిస్తాయి.... ఆ దిష్టి తగలకుండా ఎలా కాపాడుకోవాలో ఇందులో చూడవచ్చు.

దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి?


అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఎన్ని ఉంటే ఏం లాభం? అనుభవించడానికి ఆయుష్షు లేకపోతే! పూర్వం ఎందరో మహర్షులు, తపస్వులు ఆయుష్షును పెంపొందించుకోవడానికి రకరకాల మార్గాలను అవలంబించి అందులో సఫలీకృతులయ్యారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

స్థితప్రజ్ఞుడు శ్రీకృష్ణుడు


శ్రీకృష్ణుడికి కొంటె వాడనీ, శృంగార ప్రియుడనీ, మాయలోడనీ పేరు. కాని, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, భరించిన నష్టాలు మరెవరి వల్లా కాదు. కష్టమొస్తే కుంగిపోవటం, సుఖం కలిగితే సంబరపడిపోవటం ఆయన చరిత్రలోనే లేదు. అందుకే ఆయన స్థితప్రజ్ఞుడయ్యాడు. ఇలాంటి విశేషాలను వివరించే వ్యాసపూస ఇది.

శ్రావణ లక్ష్మికి స్వాగతం


శ్రావణ మాసమంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆవాసం. ఈ మాసంలో అమ్మవారిని ఏ విధంగా ఆహ్వానించాలో, మరే విధంగా ప్రసన్నం చేసుకోవాలో వివరించే ఆసక్తికరమైన విశేషాల సమాచారమిందుదో ఉంటుంది.

అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు


అయ్యప్ప దీక్షను అందరూ చేపడతారు. అయితే అసలా దీక్షలోని అర్థం పరమార్థం ఏమిటో వివరిస్తూనే, దీక్షా విశేషాలు విడమరిచే వ్యాసరహస్యమిది.

తుంగభద్రాపుష్కరాలు


తుంగ, భద్ర... ఇవి రెండు నదులు. ఈ నదుల ఆవిర్భావం, జన్మస్థానం, ఆ రెండు నదులకు జరిగే పుష్కర విశేషాలను తెలియజెప్పే వ్యాసభద్ర ఇది.

తులసీ కల్యాణ వైభోగమే...


కార్తికమాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు తులసిమొక్కనీ, ఉసిరి కొమ్మనీ సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించి మహా వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఇది అత్యంత పుణ్యప్రదం. ఈ కళ్యాణ విశేషాలను కన్నులకు కట్టే వ్యాసామలకమిది.

కార్తికమాసం ప్రాశస్త్యం

హరిహర వాసం కార్తికమాసం... ఈ మాసంలో వచ్చే పర్వదినాలు, నోములు, వ్రతాలు తదితర శుభకార్యాలను ఎప్పుడెప్పుడు ఏమి వస్తాయో, వాటిని ఎలా ఆచరించాలో వివరించే ప్రయత్నమిది.

అట్లతద్దోయ్ ...ఆరట్లోయ్...


ఆడపడచులంతా ఎంతో ఆనందోత్సాహాలతో నోచుకునే
అట్లతద్ది నోము ప్రాశస్త్యాన్ని వివరించే వ్యాసమిది.

మహాలయపక్షాల ప్రాశస్త్యం


భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు గల కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అంటారు. ఈ కాలం పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తమ తల్లిదండ్రులు ఎప్పుడు మృతిచెందారో తెలియని వారు ఈ పక్షంలో ఎప్పుడో ఒకరోజు వారి పేరిట తర్పణం విడిచి అన్నదానం చేస్తే ఎన్నో సుఖశాంతులు కలుగుతాయి.

వినాయక స్వరూపంలోని విశేషాలు


ఏనుగు తల, పెద్ద పొట్ట, చేట చెవులు, చిన్న కళ్లు, ఎలుక వాహనం... వినాయకుడి ఆకారంలో దాగి ఉన్న విశేషాలను పూసగుచ్చే మణిపూస ఇది. దీనిని డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అందించారు.

శ్రీకృష్ణ లీలామృతం


శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. మరెన్నో మహిమలు చూపాడు. వెన్న దొంగిలించాడు. వేణువు ఊదాడు. గోపికలతో శృంగార కేళిలో మునిగి తేలాడు.... అయితే ఆయన ప్రతిచర్యలోనూ ఎంతో పరమార్థముందనే విషయాన్ని చాటి చెప్పే అమృతపు అక్షరాలివి.

వరలక్ష్మీ వ్రత విధానం


మహదైశ్వర్యప్రదమైన వరలక్ష్మీవ్రత విధానాన్ని ఇందులో వివరించాను.

శ్రీమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం ఎలా?

సిరులను కురిపించే శ్రీమహాలక్ష్మమ్మ అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలో, ఏ పనులు చేస్తే, ఎలా స్తుతిస్తే ఆమె ప్రసన్నమై కాసులు కురిపిస్తుందో వివరించే వ్యాస కాసు ఇది.

వివేకం ఉంటే ఊళ్లేలవచ్చు...


ముగ్గురమ్మలు... లక్ష్మీ సరస్వతీ పార్వతులలో మధ్యన ఉండే మహా తల్లి, ఎవరి అనుగ్రహం ఉంటే పాండిత్యం కలిగి పలుకు తేనెలు ఊరతాయో అటువంటి సరస్వతీ దేవి తత్వాన్ని వివరిస్తూ... ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే ఏమి చేయాలో చెప్పే వ్యాసమాణిక్యం ఇది.

కష్టాల నుంచి గట్టెక్కించే సంకట చతుర్థీవ్రతం


ఏ పని ప్రారంభించినా ముందుకు సాగక బాధపడుతున్నవారు, బంగారాన్ని పట్టుకున్నా మట్టిలా మారి మదన పడుతున్నవారూ అందరితోనూ అవమానాలూ, అవహేళనలు ఎదుర్కొంటున్నవారూ, అష్టకష్టాలతో చిక్కుల పాలవుతున్నవారూ ఈ వ్రతం చేసుకుంటే తప్పక గట్టెక్కి తీరుతారు. అదే సంకట చతుర్థీవ్రతాన్ని గురించి వివరించే వ్యాసమోదకం.

Tuesday, August 23, 2011

అమ్మా... సల్లంగ చూడమ్మా!


తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల పండుగ పుట్టుకను, అందులోని విశేషాలను పూసగుచ్చే ప్రయత్నం ఇందులో చేశాను.

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే...


దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు విష్ణుభగవానుడు ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ కొత్త అవతారాన్ని ధరిస్తూనే ఉంటానని చెప్పాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు పది అవతారాలు ధరించాడు. శ్రీ మహావిష్ణువు తత్వాన్ని, ఆయన లీలామృతాన్ని కన్నుల ముందుంచే అక్షర కమలమిది.

ధ్యానమూ ఒకవిధమైన ప్రయాణమే


ధ్యానమనగానే కదలకుండా కూర్చోవడమనుకుంటారందరూ. కాని అది అనంతమైన ప్రయాణమని, ధ్యానంలో కూర్చుని ప్రపంచమంతా పయనించి రావచ్చని ఎందరికి తెలుసు? ధ్యానం గొప్పతనాన్ని విడమరచే వ్యాసమిది.

నేనున్నాను అంటూ అభయమిచ్చే సాయిబాబా


సమాధినుంచే తాను తన భక్తులను సర్వ కాల సర్వావస్థలయందుననూ రక్షించి కాపాడుతుంటానని చెప్పే శ్రీ షిరిడి సాయిబాబా బోధామృతపు చినుకులివి.

రామభక్తే హనుమ శక్తి


హనుమంతుడు మహాబలవంతుడు, శక్తిమంతుడు. అయితే ఆయనకంత శక్తి రావడానికి కారణం మాత్రం రామభక్తేనని చెబుతూ అందుకు నిదర్శనాలను చెప్పడం ఈ వ్యాసోద్దేశం.

మంచి చెడుల విచక్షణ తెలిస్తే ....అందరూ బుద్ధులే


ఏ వ్యక్తి అయినా పుట్టుకతోనే మంచి వాడు లేదా చెడ్డవాడు కాదు. పెంపకం కొంత, పరిసరాల ప్రభావం కొంత ఉంటుంది. అయితే తాను చేసేది మంచి లేదా చెడు అనేది తెలిస్తే, అది చేయవచ్చా లేదా అన్న విచక్షణాజ్ఞానం ఉంటే ఎవరైనా సరే బుద్ధిమంతులే అవుతారు.... అంటూ గౌతమ బుద్ధుడి గుణగణాలను వివరించే వ్యాసగౌతమం ఇది...

సీతారాముల కల్యాణము చూతము రారండీ...



శ్రీరామనవమి పర్వదినం సందర్భర గా శ్రీరాముని విశిష్ట వ్యక్తిత్వంతోబాటు శ్రీసీతారాముల కల్యాణ విశేషాలను కన్నులకు
కట్టే అక్షర తాంబూలమిది.

మీరు పంచాంగం చూస్తారా? అసలు ఎందుకు చూడాలి?


ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు పతి ఒక్కరూపంచాంగం చూస్తారు. అయితే పంచాంగం చూడటం వల్ల ప్రయోజనమేమిటి? అసలు పంచాంగం ఎందుకు చూడాలి? కళ్లుమూసుకుని ఏదో ఒక రోజున పనిని ప్రారంభిస్తే వచ్చే నష్టమేమిటి?.. తదితరాలను వివరించే విశేషాంగమిది.

శ్రీ శృంగేరీ పీఠం


జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన దక్షిణామ్నాయ శ్రీశ్రీశ్రీ శృంగేరీ పీఠం ఆవిర్భావం నుంచి, అక్కడి గురుపరంపర వరకు ఎన్నో విశేషాల పీఠమిది.

ఉత్తమం ఉత్తర ద్వార దర్శనం (ముక్కోటి ఏకాదశి పర్వదినం)


ముక్కోటికి అసలా పేరెలా వచ్చింది? ఆరోజు విశిష్ఠత ఏమిటి? స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ఫలితమేమిటి .... వంటివాటిని వివరించే అక్షరకోటి ఇది.

పర్వదినాల మయం పుణ్యమాఘం


చాలా మంది కార్తీకమాసాన్నే పర్వదినాల మాసంగా భావిస్తారు కాని, మాఘమాసంలో కూడా ఎన్నో పర్వదినాలున్నాయి. వాటిని వివరించడంతోబాటు విధివిధానాలను విడమరచే వ్యాసపర్వమిది.

హరిహర సుతుని అవతారంలో అర్థం పరమార్థం

లోకకంటకిగా తయారైన మహిషి అనే రాక్షసిని సంహరించటం కోసం హరిహర సుతునిగా అవతరించిన మణికంఠస్వామి ఆవిర్భావం, ఆ స్వామి దీక్షలోని విశేషాలను వివరిస్తుందీ వ్యాస కుసుమం.

కొలిచిన వారికి కనక వర్షం

ఆ చల్లని తల్లి పేరులోనే కనకం ఉంది. ఇక ఆమెను కొలిచిన వారికి కనక వర్షం కురవడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే ఆమెను పూజించే దానికీ ఒక విధానమంటూ ఉంది. దానిని వివరించేదే ఈ వ్యాసాభరణం.

శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుదాం...


శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమెలా అయింది? ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆచరించవలసిన విధివిధానాలేమిటి వంటి వాటిని విడమరచే వ్యాసమిది.

షష్ఠి - నష్టి కాదా? పైగా అది సర్వోత్తమమైనదా? ఎలా?


లోకంలో చాలా మంది షష్టి- నష్టి అని తేల్చేస్తుంటారు కాని అది అన్నివేళలా నిజం కాదు. షష్టి సర్వోత్తమమైనది. ఎందుకంటే ఆనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించాడు. ఈ పర్వదిన విశేషాలను వివరించే వ్యాసం.
విష్ణుసహస్రనామ పారాయణ మహిమ
విష్ణుసహస్రనామ విశిష్టత, పారాయణ మహిమ, ఫలితాలు... వంటి వాటిని వివరించే అక్షరమాల ఇది.

ఒక మామూలు రాఖీ ... రక్షగా ఎలా నిలుస్తుంది?


రాఖీ అని మనమంటున్నాం కాని అది రక్షాబంధనంగా ఎలా నిలుస్తోందో తెలియజెప్పే వ్యాసరక్షాబంధనమిది.

విభూది ధారణ మహాత్మ్యం, విశేషాలు...


విభూది అంటే ఏమిటి? దానిని ఎక్కడెక్కడ, ఎలా ధరించాలి? దానిని ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే వ్యాసవిభూతి ఇది.